రూ.16 లక్షల విలువ గల గంజాయి ధ్వంసం
-:జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి
రూ.16 లక్షల విలువ గల గంజాయి ధ్వంసం
-: జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి
కర్నూలు క్రైమ్, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధులలో పట్టుబడిన గంజాయిని కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా (2018 నుండి 2022 ఇప్పటి వరకు) జిల్లా వ్యాప్తంగా 104 కేసులకు సంబంధించి 400 కేజీల గంజాయిని చేసి నిప్పు అంటించి తగలబెట్టారు. 10 రోజుల నుండి కార్యచరణ ప్రణాళిక చేపట్టామన్నారు.ప్రతి పోలీసుస్టేషన్ లో , కోర్టులలో పెండింగ్ ఉన్నటు వంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని మెజిస్ట్రేట్ అనుమతి తో , ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు. దహనం చేసిన గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా, సిసియస్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు మధు సుధన్ రావు , కంబగిరి రాముడు, మల్లికార్జున, ఆర్ ఐ రవి కుమార్ ఉన్నారు.