భగత్ సింగ్ ఆశయ సాధనకై ఉద్యమిద్దాం
….పి డి ఎస్ యు నాయకులు
ఆదోని ప్రతినిధి, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
ఆదోని పట్టణం సీపీఐ (ఎంయల్ ) న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ రాజ్ గురు, సుఖదేవ్ ల,91వ సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది. అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. పీడి యస్ యు రాష్ట్ర నాయకులు తిరుమలేష్ అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున , ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి వెంకప్ప మాజీ పి డి ఎస్ యు నాయకులు నరేష్ ఆచారి మాట్లాడుతూ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణలోనే చరిత్ర గమనం ముందుకు సాగుతుంది. గత ఏడాది కాలం కూడా చీకటి, వెలుగుల మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. మన విద్యార్ధులను కనిపెంచే తల్లిదండ్రులనే దేశ ప్రజలుగా భగత్ సింగ్ భావించాడు. వారిలో కార్మిక, కర్షక వర్గాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలాంటి శ్రమ జీవులు పోరాడి బ్రిటీష్ సామ్రాజ్యవాద దాస్య శృంఖలాల నుండి భారతదేశ విముక్తిని సాధించాలని ఆశించాడు. బ్రిటీష్ ప్రత్యక్షపాలన ముగిసి 75 ఏళ్ళు నిండుతోంది. చీకటి శక్తులపాలనే కొనసాగుతోంది. చీకటి చట్టాలపై భారత రైతాంగం ఏడాదికి పైగా పోరాడి విజయం సాధించింది. అలాంటి చట్టాల మీదే భారత కార్మికవర్గం ఈ నెల 28,29లలో సార్వత్రిక సమ్మెచేయనున్నది. చీకటి శక్తులతో పోరాటాలకు ఈ ఏడాది కాలం గుర్తుగా నిలుస్తుంది. రానున్న ఏడాది కూడా పోరాటాల సంవత్సరంగా చరిత్రలో నిలుస్తుంది. పై అమరుల స్ఫూర్తితో రానున్న పోరాటాల కాలానికి విప్లవస్వాగతం పలుకుదాం. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అఖండ నాయుకులు రమణ జాన్ ఉమేష్ తేజ మనోజ్ శివ తదితరులు పాల్గొన్నారు.