దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
ఐ ఫ్ టీ యు జిల్లా అధ్యక్షుడు వెంకప్ప పిలుపు
దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
ఐ ఫ్ టీ యు జిల్లా అధ్యక్షుడు వెంకప్ప పిలుపు
ఆదోని ప్రతినిధి, మార్చి 23, ( సీమకిరణం న్యూస్) :
ఈనెల 28,29 న జరుగు దేశవ్యాప్త సర్వతిక సమ్మెను జయప్రదం చేయాలని ఐ ఫ్ టీ యు బాగా జిల్లా అధ్యక్షుడు వెంకప్ప పిలుపునిచ్చారు . బుధువరం ముఖకార్యకర్తలు సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఐ ఫ్ టీ యు జిల్లా కార్యదర్శి వెంకప్ప మాట్లాడుతూ కార్మికులు బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 29 చట్టాలను ఉంచుతూ , వాటిని నాలుగు లేబర్ కోడ్ ల గా తీసుకొని రావడం జరుగుతున్నదని . పదహైదు కార్మిక చట్టాలను కాలం చెల్లి నాయని , వాటిని రద్దు చేయడం జరిగినది . ఈ లేబర్ కోడ్ లను ఏప్రిల్ ఒకటో తేది నుండి కేంద్ర ప్రభుత్వం అమలు లోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది. వీటిని వ్యతిరేకిస్తూ ఈ నెల 28 , 29 ,తేదిలలో దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగినది . కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ లు ఆచరణలో కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేకుండా , యాజమాన్యానికి కట్టు బానిసలుగా ఉండటానికి ఉపయోగపడే పరిస్థితి ఉన్నది . ఇప్పుడు నుండి కార్మికులు. 12 గంటల పని విధానం చట్టబద్ధంగా ఉండును . కార్మికుల కు సమ్మె చేసే హక్కు ఉండదు , సమ్మె చేసే కార్మికుల ను ఉద్యోగం నుండి తొలగించే హక్కు యాజమాన్యానికి ఉండును . ఇంకా గతంలో 20 మంది ఉన్న చోట కార్మికులకు లేబర్ చట్టాలు వర్తించే వి , ఇప్పుడు నుండి వందమంది కార్మికులు ఉంటేనే లేబర్ చట్టాలు వర్తిస్తాయి . గతంలో ఫ్యాక్టరీల్లో వందమంది కార్మికులు ఉంటే లేబర్ చట్టాలు వర్తించే వి , ఇప్పుడు ఫ్యాక్టరీలలో 300 మంది కార్మికులు ఉంటేనే లేబర్ చట్టాలు వర్తిస్తాయి . బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్ కంపెనీలకు , బహుళజాతి కంపెనీలకు , పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నది . ఈ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని , కేంద్ర ప్రభుత్వo కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబించడాని ఉపసంహరించు కొనే వరకు జరిగే ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిస్తున్నాము . ఈ కార్యక్రమంలో సీపీఐ యం ఎల్ న్యూ డేమోక్రసి జిల్లా ప్రతినిధి మల్లికార్జున, ఐ ఫ్ టీ యు నాయుకులు నరేష్,తేజ,రవి పాల్గొన్నారు.