….. ఆదోని జిల్లా సాధన కోసం గోబ్యాక్ అంటూ పోరాడుదాము
ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం సైమన్ కమిషన్ గోబ్యాక్ అని పోరాడారు,
….. ఆదోని జిల్లా సాధన కోసం ఆడ గోబ్యాక్ అంటూ పోరాడుదాము*
…..రాయలసీమ కో-ఆర్డినేషన్ కమిటీ ఆర్ సీసీ పిలుపు
ఆదోని ప్రతినిధి, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
భారతదేశ స్వతంత్ర పోరాటంలో సైమన్ కమిషన్ గోబ్యాక్ అంటూ పోరాడిన స్పూర్తితో ఆదోని జిల్లా సాధన కోసం ఎంఏ డీఏ (ఆడ) గోబ్యాక్ అంటూ పోరాడాల్సిన అవసరం ఉందని రాయలసీమ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చారు. నేడు ఆదోని కి కలెక్టర్ పర్యటనను, ఆడ అధికారుల పర్యటనను నిరసిస్తూ ఆర్ సీసీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆర్ సీసీ రాష్ట్ర కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ప్రజలు అసమాన త్యాగాలు చేస్తూ పోరాడుతుంటే.. సందట్లో సడెమియా అన్న చందంగా సైమన్ కమిషన్ ని తీసుకువస్తే..ప్రజలందరూ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తూ మాకు స్వతంత్ర్యమే కావాలి మా దేశాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామాని నినాదంతో పోరాడిన ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని, అదే స్ఫూర్తితో ఆదోని జిల్లా కోసం నేడు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దేశానికి నేడు ఒక స్ఫూర్తిని నింపే రోజని దేశం కోసం నవ్వుతూ ఉరికంభంఎక్కిన భగథ్ సింగ్,రాజగురు, సుఖ్ దేవ్ లు అమరులైన వారి త్యాగాల ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రజలంతా ఆదోని జిల్లా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. గత 2 సంవత్సరాలుగా ఆదోని జిల్లా కోసం.ఎన్నెన్నో పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం, అధికారులు ఏమి ఎరుగని నంగానాచిల్లా ఎమ్ మొఖం పెట్టుకొని ఆదోని పర్యటనకు వస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నిoచారు. కావాల్సింది ఆదోని జిల్లానే కానీ ఇంకేదో కాదని అన్నారు.ఏఏడీఏ వల్ల జరిగేది ఏమీలేదని వెనుకబాటు తనం పేరుతో వచ్చే నిధులు, ఎవరి జేబుల్లోకి చేరుతాయో ప్రజలకి తెలుసని అన్నారు. అభివృద్ధి చెయ్యలనుకుంటే జిల్లా ప్రకటనతో పాటు దాని విధివిధానాలు ఏంటో కూడా ప్రకటన చేయాలని అన్నారు. ఇప్పటివరకు ఒక బ్లూ ప్రింట్ లేకుండా గాల్లో దీపం పెట్టినట్లు గా ఆడ పేరుతో తేడా భజన చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఖచ్చితంగా సమాధానం చెప్పాలని అన్నారు. వెనుకబాటు తనం కొన్ని నిధులద్వారానో, లేక ఇలాంటి కంటి తుడుపు చర్యల ద్వారానో పోదని, దానికి స్వయంపాలనే సరైన మార్గం అని రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ గా మా అభిప్రాయం అదేనని అన్నారు. అందుకే ఆడ లోగుట్టు, బట్టబయలు చేసేందుకే త్వరలో కార్యాచరణ కూడా ప్రకటిస్తామని అన్నారు. సైమన్ గోబ్యాక్ పోరాట స్పూర్తితో, అమరులైన భగత్ సింగ్, రాజగురు,సుఖ్ దేవ్ లా స్పూర్తితో ఆదోని జిల్లా కోసం యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, విద్యావంతులు, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా పొరటంలోకి రావాలని పిలునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ కో ఆర్డినేషన్ రాష్ట ప్రణాళిక కమిటీ నాయకులు రామకృష్ణ రెడ్డి,సుంకన్న,రాయలసీమ విద్యార్థి సంఘ నాయకులు రవి,సీమ కృష్ణ,రామరాజు,లాజరస్ తదితరులు పాల్గొన్నారు.