భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ 91 వర్ధంతి
భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ 91 వర్ధంతి
పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె నాగరాజు
ఆదోని ప్రతినిధి, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
సామ్రాజ్యవాద పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమించడ మే నిజమైన దేశభక్తి అని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నాగరాజు అన్నారు. బుధవారం విశ్వ నారాయణ జూనియర్ కళాశాలలో షాహిద్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ 91వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కె.నాగరాజు మాట్లాడుతూ సామ్రాజ్యవాదం,హిందుత్వ ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుండి 30 వరకు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 91వ వర్ధంతి సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.యువత ,విద్యార్థులు భగత్ సింగ్ త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దోపిడీ,పీడన లేని వ్యవస్థ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.దేశభక్తి ముసుగులో హిందుత్వ ఫాసిస్టు శక్తులు దేశ ప్రజలపై దాడులు చేస్తూ కుల,మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేదుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ చేసిన పోరాటం యువజనులు,విద్యార్థులకు ఎంతో ఆదర్శంగా నిలిచిందన్నారు.దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వలస పాలనలో దేశానికి స్వాతంత్రం కావాలని చిన్న వయస్సులోనే తమ ప్రాణాలను త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు డివిజన్ అధ్యక్షులు జయకర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శివలోకేశ్,నాయకులు ఆదిత్య,వంశీ ,అశోక్, మరియు విద్యార్థి,విద్యార్థినులు పాల్గొన్నారు.