మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
-: ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా
ఎమ్మిగనూరు టౌన్, మార్చి 24 (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూర్ నియోజకవర్గ పరిధిలో జైకే సీడ్స్ మొక్కజొన్న (సీడ్ క్రాఫ్ట్) నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (ఏ ఐ కె ఎస్) ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.సత్యన్న, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి జి రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి తిమ్మగురుడు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెకె సీడ్స్ వారి ఇచ్చిన మొక్కజొన్న విత్తనాల పంట వేసిన రైతులు పంట దిగుబడి లేదని సీడ్స్ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని కంపెనీ యాజమాన్యం రైతులకు విత్తనాలు ఇచ్చి నట్టేట ముంచటం జరిగిందని దిగుబడి లేక రైతులు అప్పుల పాలవుతున్నారనీ, ఇప్పటికే ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందని కానీ జె కే సీడ్స్ విత్తనాల వల్ల పంట పూర్తిగా నాశనం అవ్వడం జరిగిందని వారు తెలిపారు. జెకె సీడ్స్ ఎమ్మిగనూరు మండలం లో రైతులకు ఇవ్వడం జరిగిందని అక్టోబర్ నవంబర్ నెలలో విత్తనాలు వేసిన పంట పూర్తిగా ఖాళీ కంకులు కనిపిస్తున్నాయి తప్ప గింజలు లేవని పరిశీలించమని రైతులు jk కంపెనీ వారు మాకు సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని రైతులకు చెప్పడం జరిగిందని వారు తెలిపారు. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి జెకె కల్తీ విత్తనాల ను సీజ్ చేయాలని, అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ సీడ్స్ వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరియు జేకె సీడ్స్ నిర్వహిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కేసీ జబ్బర్,హనుమంతు, ఏఐటీయూసీ తాలూక అధ్యక్ష కార్యదర్శులు వీరేశ్, బాలరాజు, మునిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర, ఏఐవైఎఫ్ తాలూక కార్యదర్శి ఏసు రాజు, పార్టీ ప్రజాసంఘాల నాయకులు మల్లికార్జున గౌడ్, కాజా, నరసింహులు ఈరన్న, ఖాదర్, సమీర్,ప్రతాప్,రవి, తదితరులు పాల్గొన్నారు.