ANDHRABREAKING NEWSSTATE
భక్తుడి నడక
భక్తుడి నడక
సి.బెళగల్, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు కర్ణాటక రాష్ట్రం నుండి ఉగాది పండుగ సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలను చూసేందుకు కర్ణాటక రాష్ట్రం నుండి భారీ సంఖ్యలో భక్తులు పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు. కర్ణాటక ప్రజలు బ్రమరాంబికా దేవిని ఆరాష్ట్ర ఆడపడుచుగా కొలిచి ఆరాధిస్తారు. అందుకోసమే పుట్టింటి లాంఛనంగా చీరను సారెగా ఉగాది పండుగ రోజున శ్రీశైలంలో అమ్మ వారికు అందజేస్తారు. అందువలననే కర్ణాటక రాష్ట్రం నుండి ఎండను సైతం లెక్కచేయకుండా దాదాపు 850 కిలోమీటర్లు నడిచి పండగ రోజు కంతా శ్రీ గిరి చేరుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ను దర్శించుకోవటం వారి ఆనవాయితీ.