ఆటో డ్రైవర్లకు సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
ఆటో డ్రైవర్లకు సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
డోన్ టౌన్, మార్చి24, (సీమకిరణం న్యూస్) :
పట్టణంలో స్థానిక పాతబస్టాండ్ నుండి ఏ ఐ టి యు సి రాష్ట్ర ఆటో వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు డోన్ నియోజకవర్గ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక పాతబస్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి ఎమ్మార్వో ఆఫీస్ వరకు చేరుకొని ఆటో డ్రైవర్ల సమస్యల పట్ల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్వర్ డోన్ నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు పుల్లయ్య అబ్బాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ చలానా జీవో నెంబర్ 21 రద్దు చేయాలని 60 సంవత్సరాల పైబడిన డ్రైవర్లకు పెన్షన్ కల్పించాలని ఉచిత వైద్యం అందించాలని పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలి నిత్యవసర సరుకులను తగ్గించాలి లేనిపక్షంలో రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని వారు ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగినది. అలాగే ఈ నెల 28 29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో లో అధిక సంఖ్యలో ఆటోడ్రైవర్లు పాల్గొనాలని వారు ఆటోడ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు రామకృష్ణ నారాయణ మధు రఫీ అయ్యన్న సెక్ష షాకీర్ లక్ష్మన్న భాషా తదితర ఆటో డ్రైవర్ ధర్నా లో పాల్గొనడం జరిగింద. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కి ఆటో డ్రైవర్ల సమస్యలపై ఒక డిమాండ్లపై వినతి పత్రము అందజేయడం జరిగినది.