
క్షయవ్యాధి పై అవగాహన ర్యాలీ
ప్యాపిలి, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ ఆధ్వర్యములో ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధి పైన అవగాహన ర్యాలీ నిర్వహించారు. 2025 నాటికి వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి అని ప్రభుత్వము పిలుపునివ్వడం జరిగినది , రాబర్ట్ కాకు క్షయ వ్యాధి మైకో బ్యాక్టీరియము టుబెర్ కులే ద్వారా వస్తుంది అని తెలిపారు. ఎల్. రాఘవేంద్ర గౌడ్ ఆరోగ్య విద్యా బోధకుడు మాట్లాడుతూ వ్యాధి తొందరగా గుర్తించడం వలన ఇతరులకు వ్యాధి నీ వ్యాపించకుండా చేయవచ్చును, నిర్దారణ పరీక్షలు, మందులు ఉచితం మరియు 6 నెలల పూర్తి చికిత్స కాలము మందులు వాడాలి మద్యలో మాణివేయ కూడదు, పోషకాహారం కొరకు ప్రతి నెల 500 రూపాయలు వారి అకౌంట్ లో జమచేయడము అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్య పర్వేక్షకులు మనోహర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, అబ్దుల్లా ఆరోగ్య కార్య కర్త లు, ఆశావర్కర్లు పాల్గొన్నారు