
పొంచి ఉన్న పట్టించుకోని అధికారులు….!
నంద్యాల రూరల్, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల సమీపంలోని ఆర్టిఓ కార్యా లయం దగ్గరలో ఉన్న బయో డీజిల్ఎదుట కరెంటు స్తంభాలు ఒంగి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించు కోవడం లేదని ఆక్కడ నివసిస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నంది డైరీలో పని చేస్తున్నా కార్మికులు మరియు వందలాది వాహనాలు నంద్యాల నుంచి కర్నూలు తిరుగుతుంటాయని ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాలు విరిగి పడితే పెద్ద ప్రమాదం జరుగే అవకాశం ఉందని కార్మికులు ఆరోపిస్తు న్నారు. అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉండడం వల్ల భయభ్రాంతులకు గురవు తున్నరు .కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే వంగిన స్తంభాల ప్రాంతంలో కొత్త స్తంభాలు వేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.