28, 29 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్
28, 29 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్
కర్నూలు టౌన్, మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
ఈ నెల 28, 29 తేదీలలో జరుగు సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్( ఐ ఎఫ్ టి యూ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజి,తిరుపాల్ పిలుపునిచ్చారు.
అనంతరం స్థానిక కర్నూలు పట్టణంలో గోకారి భవన్ నందు జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అంజి అధ్యక్షత వహించగా కార్యదర్శి టీ.తిరుపాల్ మాట్లాడుతూ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్ల ను తీసుకువస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ, పెట్టుబడిదారులకు ఊడిగంచేస్తున్నారని వాపోయారు. ప్రజల డబ్బుతో ప్రభుత్వ రంగ సంస్థలను గత ప్రభుత్వాలు నిర్మిస్తే, వాటిని మోడీ ప్రభుత్వం కారుచౌకగా తెగనమ్ము తున్నదని విమర్శించారు. కరోనా కష్టకాలంలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, ఆ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని, సమ్మె చేసే హక్కు కోల్పోతారని, పని గంటలు, పని భారం పెరుగుతుందని, బానిసల కంటే హీనమైన స్థితికి నెట్టి వేయ పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలను, బ్యాంకింగ్ రంగాన్ని, ఎల్ఐసి,హెచ్పిసిఎల్, బిఎస్ఎన్ఎల్, విమాన రంగం, ఓడరేవులు, బొగ్గు, విద్యుత్, చివరికి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ మోడీ ప్రభుత్వం ముందుకు పోతుందని, దేశ ప్రజల ఆస్తులను పెట్టుబడిదారులకు కట్ట పెడుతుందని విమర్శించారు. లేబర్ కోడ్ ల రద్దు కోసం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఐ.ఎఫ్.టి.యు స్వతంత్రంగా చేస్తున్న మార్చి 28, 29 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలు లు పాల్గొని విజయవంతం చేయాలని, మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్ష కార్యదర్శులు మనోహర్, సురేష్ నాయక్, జిల్లా నాయకులు ఓబులేష్,శివ,రఘు, లాలు, మహేష్, శ్రీనివాసులు, పవన్, రాజు, సామేలు, నాగరాజు, అనిల్, రాములయ్య, భరత్, భాష, శ్రీను, మహేష్, వంశీ, నిరంజన్ మొదలైన వారు పాల్గొన్నారు.