ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
శ్రీశైలం బోర్డు మెంబెర్ గా సూరి శెట్టి మాధవిలత
శ్రీశైలం బోర్డు మెంబెర్ గా సూరి శెట్టి మాధవి లత ప్రమాణ స్వీకారం
శ్రీశైలం బోర్డు మెంబెర్ గా సూరిశెట్టి ప్రసాద్ గుప్తా సతీమణి సూరి శెట్టి మాధవి లత ప్రమాణ స్వీకారం
శ్రీశైలం /మైదుకూరు, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
మైదుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరి శెట్టి ప్రసాద్ గుప్తా సతీమణి శ్రీమతి మాధవి లతను శ్రీశైలం బోర్డు నెంబర్ గా ప్రభుత్వం నూతన జీవోలో నియమించడంతో శుక్రవారం తెల్లవారు జామున ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడంలో భాగంగా శ్రీమతి మాధవి లత ను శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించింది. శ్రీమతి మాధవి లత శివుని భక్తురాలు కావడంతో ఈ అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.