ఆటోల బంద్ విజయవంతం చేయండి
ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్
కర్నూలు టౌన్, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
ఈ నెల 28, 29 తేదీలలో జరుగు సార్వత్రిక సమ్మె భాగంగా ఆటోల బంద్ విజయవంతం చేయాలని ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్( ఐ ఎఫ్ టి యూ) జిల్లా కార్యదర్శి తిరుపాల్, నగర కార్యదర్శి సురేష్ నాయక్ పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక కర్నూలు పట్టణంలో బిర్లా గేట్ ఆటో స్టాండ్ దగ్గర ఆటోల బంద్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీ.తిరుపాల్ మాట్లాడుతూ అధిక పెనాల్టీ ల జీవో నెంబర్ 25 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి ప్రతి ఒక్క ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్టిఏ పోలీస్ దాడులను ఆపాలని, పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరంలో లో ఆటో బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, ఆ కోడ్లు అమలులోకి వస్తే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని, సమ్మె చేసే హక్కు కోల్పోతారని, పని గంటలు, పని భారం పెరుగుతుందని, బానిసల కంటే హీనమైన స్థితికి నెట్టి వేయ పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ ల రద్దు కోసం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఐ.ఎఫ్.టి.యు స్వతంత్రంగా చేస్తున్న మార్చి 28, 29 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలు లు పాల్గొని విజయవంతం చేయాలని, మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు మాభాష, ఓబులేష్,శివ,రఘు, లాలు, మహేష్, శ్రీనివాసులు, పవన్, రాజు, సామేలు, నాగరాజు, అనిల్, రాములయ్య, భరత్, భాష, శ్రీను, మహేష్, వంశీ, నిరంజన్ మొదలైన వారు పాల్గొన్నారు.