నీటి పన్ను వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి
నీటి పన్ను వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలి :-
స్పందన అర్జీలు రీ ఓపెన్ కాకూడదు :-
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి :-
సంబంధిత అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి :-
కర్నూలు కలెక్టరేట్, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
రైతుల నుండి నీటి పన్ను వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలని ఆర్డిఓ, తహసీల్దార్ లను జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఆర్ డి ఓ లు, తహసీల్దార్లతో భూసేకరణ, రైతుల నుండి నీటి పన్ను వసూలు, జగనన్న సంపూర్ణ గృహ హాక్కు పథకం, మీసేవ దరఖాస్తులు, స్పందన ఫిర్యాదులు, పిఓఎల్ ఆర్ రీ-సర్వే, తదితర రెవిన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) మాట్లాడుతూ రైతుల నుండి నీటి పన్ను వసూళ్లు చేయడంలో ఆస్పరి, పగిడ్యాల మండలాలు వెనుకబడి ఉన్నాయని, సత్వరమే వసూలు చేయడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలని తహసీల్దార్ లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీతనంతో సత్వరమే పరిష్కారం అందించాలని తహశీల్దార్లను ఆదేశించారు. స్పందన అర్జీలు రీ ఓపెన్ కాకుండా గడువులోగా అర్జీలను నిశితంగా పరిశీలించి ఖచ్చితమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారం కాని దరఖాస్తులను తిరస్కరించకుండ నిర్దిష్ట కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. స్పందనలో వచ్చిన అర్జీల తిరస్కారం జీరో కావాలన్నారు. బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి ఏ ఒక్క అర్జీ కూడా పోకూడదు, రీ ఓపెన్ అయినా, బియాండ్ ఎస్ఎల్ ఏలోకి వెళ్లిన సంబంధిత అధికారి పై చర్యలు తప్పవన్నారు. మ్యూటేషన్ లు బియాండ్ ఎస్ఎల్ ఏలోకి వెళ్లకుండా గడువులోగా పరిష్కరించాలని తహసీల్దార్ లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మంజూరైన పలు ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పక్రియ పనులు పెండింగ్ లేకుండా వేగవంతం చేయాలని ఆర్డీఓలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హాక్కు పథకం సంబంధించి రెవిన్యూ శాఖ దగ్గర విఆర్ ఓ లాగిన్ లో వ్యాలీడేషన్, అప్రూవల్ పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలన్నారు. తహసీల్దార్ పరిధిలో అప్రూవల్, రిజిస్ట్రేషన్, స్కానింగ్ తదితర అన్నీ పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హతగల లబ్ధిదారులకు 90 రోజుల్లో ఇంటి పట్టాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ లను ఆదేశించారు. పిఓఎల్ ఎల్ ఆర్ రీసర్వే సంబంధించి గోనెగండ్ల, పెద్దకడబూరులో జరుగుతున్న గ్రౌండ్ వ్యాలీడేషన్, డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పనులన్నీ ఆదివారం కల్లా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కోసిగి లో జరుగుతున్న డ్రోన్ సర్వే సంబంధించి పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్ ను ఆదేశించారు. డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ…. ప్రతి నెల 30 తేదీ సివిల్ రైట్స్ డే నిర్వహించాలని తహసీల్దార్ లను ఆదేశించారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ కేసులకు సంబంధించి రిపోర్టులు సకాలంలో కలెక్టరేట్లోని డిఆర్ ఓ కార్యాలయంలో సబ్మిట్ చేయాలన్నారు. నందవరం, ఎమ్మిగనూర్ నుంచి లోకాయుక్త, హెచ్ ఆర్ సి కేసులు నమోదవుతున్నాయిని, ఆ కేసులకు సంబంధించి రిపోర్టులు పెండింగ్ లేకుండా వెంటనే పంపించాలన్నారు. అందులో భాగంగా రెవెన్యూ పరమైన పలు అంశాలపై తహసీల్దార్ లతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ ఓ పుల్లయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి హరికృష్ణ, హౌసింగ్ ఈఈ నాగరాజు, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.