శ్రీశైల భక్తులకు ఉచితంగా పండ్లు మజ్జిగ త్రాగునీరు పంపిణీ
శివ భక్తులకు పండ్లు పంపిణీ చేస్తున్న స్నేహితులు

శ్రీశైల భక్తులకు ఉచితంగా పండ్లు మజ్జిగ త్రాగునీరు పంపిణీ
శివ భక్తులకు పండ్లు పంపిణీ చేస్తున్న స్నేహితులు
కర్నూలు పట్టణంలో శుక్రవారం ఉదయం కాలినడకన శ్రీశైలం వెళుతున్న భక్తులకు నగరానికి చెందిన స్నేహితులు విద్యాసాగర్ రహమాన్ మద్దయ్య కరణ్ కుమార్ నవీన్ కుమార్ కృష్ణారెడ్డి జిఎం కుమార్ కృష్ణ రంగన్న కే కృష్ణ లు కలిసి ఈ రోజుఉదయం వెంకటరమణ కాలనీ లో శివ భక్తులకు పండ్లు మజ్జిగ త్రాగునీరు పంపిణీ చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుండి ఎండలో కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులు ఎంతో ఇబ్బందులతో కాలినడకన శ్రీశైలం దర్శనానికి వెళుతున్న వీరికి తమ వంతు సహాయంగా 35 బాక్సుల పండ్లను అదేవిధంగా ఎండలు విపరీతంగా ఉండడంతో పండ్లు మజ్జిగ త్రాగునీరు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం తమ వంతు భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మనసుకు కొంత సంతోషాన్ని అందిస్తుందని ఇలాంటి కార్యక్రమాలు తమ శక్తి కొలది ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరు చేయవలసిందిగా కోరారు.