నూతన వరి కోత యంత్రం ప్రారంభించిన ఎంపీపీ
నూతన వరి కోత యంత్రం ప్రారంభించిన ఎంపీపీ
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
మండల పరిషత్ అధ్యక్షురాలు బోయిళ్ళ పద్మజా రెడ్డి ఏఎస్ పేట మండలం లోని గుడిపాడు సి హెచ్ సి క్లస్టర్ రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన వరి కోత యంత్రాన్ని బుధవారం ప్రారంభించారు. అధికారుల సమక్షంలో రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా గుడిపాడు ఎంపీటీసీ భర్త తిరుపతిరెడ్డి ఎంపీపీ పద్మజ రెడ్డిని అధికారులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మజ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన వరి కోత యంత్రాలు రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు .ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర ఇస్తున్నారని రైతులు గిట్టుబాటు ధర కోసం ఆ కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దేవసేన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం 16 వరి కోత యంత్రాలు మంజూరు చేసిందన్నారు .ఏఎస్ పేట మండలానికి 4 మంజూరయ్యాయన్నారు. ఒక్కో యంత్రం 25 లక్షల కాగా ప్రభుత్వం రైతుల నుంచి 12.5 లక్షలు, బ్యాంకు1 2.5 లక్షలు ఇస్తుందన్నారు .అందులో 8.8 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని అది రైతులకు వస్తుందన్నారు. ఏవో రజనీ మాట్లాడుతూ గుడిపాడు లో మేకపాటి గౌతం రెడ్డి క్లస్టర్ హైరింగ్ కమ్యూనిటీ సెంటర్ రైతులు ఏర్పాటు చేసుకున్నారని ఆ సెంటర్ రైతులకు వరి కోత యంత్రం అందజేశామన్నారు. ఎంపీడీవో రజనీకాంత్ మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధర కోసం ధాన్యం కేంద్రాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని పూర్తి చేసి మండలాన్ని మొదటి స్థానంలో ఉంచాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి మాట్లాడుతూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహకారంతో మండలంలో 4 వరి కోత యంత్రాలు వచ్చాయన్నారు .ప్రస్తుతం యంత్రాలు పంపిణీలో మంత్రి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ధాన్యం కోసం రైతులు ఓపిక వహించి నిదానంగా గిట్టుబాటు ధరకు ధాన్యం కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని సూచించారు. .ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు సంధాని భాష, సర్పంచులు రంగారెడ్డి ,హజరత్ అమ్మ, నాయకులు తిరుపతి రెడ్డి, రమణారెడ్డి ,చిరంజీవి, వెంకటేశ్వర్లు ,గుడిపాడు సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ ,ఉద్యోగులు ,రైతులు పాల్గొన్నారు…..