అధికారులు సమయపాలన పాటించాలి : ఎంపీపీ
అధికారులు సమయపాలన పాటించాలి : ఎంపీపీ
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
మండలంలోని అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటిస్తూ సకాలంలో కార్యాలయాలకు హాజరై ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఏఎస్ పేట మండల అధ్యక్షురాలు బి.పద్మజారెడ్డి పేర్కొన్నారు ఆమె స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలోనీ సమావేశ మందిరం లో బుధవారం పొదుపు సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు సకాలంలో కార్యాలయాలకు హాజరై ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కృషి చేయాలన్నారు సమయపాలన పాటించని వారిపై సంబంధిత శాఖల పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ పనిచేయాలన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ముందు ఉండాలన్నారు కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పు కోరాదన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రజినీకాంత్, ఏరియా కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, ఏపిఎం బుజ్జమ్మ ,సీసీలు వివోఏ లు సంఘ బంధం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు