పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలి
కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి

జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశం
కర్నూలు క్రైమ్, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
పెండింగ్ కేసుల పై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు …
1. 9 నెలల్లో కేసుల పెండింగ్‌ను 27 శాతానికి పైగా తగ్గించిన పోలీసు అధికారులను అభినందిస్తున్నామన్నారు. కేసుల పెండింగ్ 27, 500 నుండి 20, 000కి తగ్గించబడిందన్నారు.
2. పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని , ప్రతీ కేసులో కచ్చితమైన ప్రణాళికతో దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేరం చేసినవారికి సరైన శిక్ష పడేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, నేరాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసు అధికారులు కృషిచేయాలని ఆదేశించారు.
3. 2 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను నేర సమీక్షా సమావేశంలో చర్చించారు.
4. హత్య, అత్యాచారం మరియు పోక్సో కేసులను గురించి చర్చించి పలు సూచనలు తెలియజేశారు.
5. స్పందన మరియు ఇతర మోడ్‌ల ద్వారా స్వీకరించిన పిటిషన్‌లను తర్వితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
6. డి పి ఓ కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన సూచనలు చేశారు.
7. నంద్యాల డి పి ఓ కార్యాలయం సంబంధిత ఏర్పాట్ల పురోగతి పై చర్చించారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీలు చిదానందరెడ్డి, రాజేంద్ర, డిఎస్పీలు మహేశ్వరరెడ్డి , వెంకటాద్రి , వెంకట్రామయ్య, శ్రీనివాసులు, వినోద్ కుమార్, యుగంధర్ బాబు, రామాంజినాయక్, శ్రీనివాస రెడ్డి, శ్రీమతి శృతి మరియు సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.