అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసు యంత్రాంగం
జనసేన పార్టీ నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసు యంత్రాంగం
…. జనసేన పార్టీ నాయకురాలు ఫిర్యాదు చేసిన స్పందించని పోలీసులు
… ఇంటి వద్ద ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ గూండాలు
…. సాక్షాలు కళ్లెదుటే కనిపిస్తున్న పోలీసులు పలకని వైనం
జనసేన పార్టీ నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు
కర్నూలు క్రైమ్, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
అధికారపార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని జనసేన పార్టీ కార్యాలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు రోజురోజుకు అధికార పార్టీ చెందిన కొంతమంది నాయకులు తమ గుండాలతో చెలరేగి పోతున్నారని నగరంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయించారని జనసేన పార్టీ నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు తీవ్రంగా విమర్శించారు. ఇంజనీరింగ్ చేసిన హసీనా బేగం ప్రజలకు అంకితభావంతో సేవ చేసేందుకు ఇటీవలే జనసేన పార్టీలో చేరారని అన్నారు. క్రియాశీలక సభ్యత్వం నమోదు లో కూడా ముందంజలో ఉండడాన్ని తెలుసుకున్న వై ఎస్ ఆర్ సి పి నాయకులు జనసేన పార్టీ కార్యాలయం నగర మేయర్ క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న కారణంగా అక్కడ నుండి ఈ కార్యాలయాన్ని ఖాళీ చేయించేందుకు పన్నాగం పన్నుతున్నారని అన్నారు .ఇందులో భాగంగానే కొంతమంది గూండాలను పంపించారని అన్నారు. అక్కడ ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకొని వెళ్లి అక్కడే ఉన్న జనసేన పార్టీ సిబ్బంది దగ్గర ఉన్న సెల్ ఫోన్లు లాక్కొని ఫర్నిచర్ను కంప్యూటర్లను బయటికి రోడ్డుపైకి పడేశారని ఈ విషయాన్ని మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు స్పందించడం లేదని విమర్శించారు. ఇదిలా ఉండగా అంతటితో ఆగకుండా అర్ధరాత్రి సమయంలో హసీనా బేగం ఇంటి వద్ద నిలిపి ఉన్న కారు అద్దాలను కూడా వైయస్సార్సీపి గుండాల చేత ధ్వంసం చేయించారని అన్నారు. అక్కడ బలవంతంగా రోడ్డుపైన సామాన్లు పడేసిన విషయం కారు అద్దాలు రాళ్లతో బ్రేక్ చేస్తున్న వారి చిత్రాలన్నీ సీసీ ఫుటేజీలో స్పష్టంగా ఉన్నాయని ఇదంతా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సమక్షంలోనే ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇదంతా కేవలం అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ది కాదా అని ప్రశ్నించారు. మేయర్ క్యాంపు కార్యాలయం ఎదుట జనసేన పార్టీ కార్యాలయం ఉండకూడదన్నది వారి ధ్యేయమని అన్నారు. అందుకే ఇంటి ఓనర్లు చేత బలవంతంగా ఖాళీ చేయించేందుకు ఇదంతా పన్నాగం చేస్తున్నారని అన్నారు. ఇదేవిధంగా వైయస్ఆర్ సీపీ నాయకులు తమ గుండాల చేత దాడులకు పాల్పడితే ఈ విషయాలను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
సాక్షాలు అన్ని కళ్ళ ఎదుట స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హసీనా బేగం ఇంటి వద్దకే వెళ్లి కారు అద్దాలు పగలగొట్టారు అంటే వారికి ఏ మోతాదులో పోలీసుల అండదండలు ఉన్నాయి అన్నది స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా సీసీ ఫుటేజీ ఆధారంగా తప్పు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.