సీమ నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
సీమ ఎమ్మెల్యే,ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి..
జనసేన ఆధ్వర్యంలో లో రైతులతో త్వరలో నిరసన..
జనసేన నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు..
కర్నూలు క్రైమ్, మార్చి 25, (సీమకిరణం న్యూస్) :
హంద్రీనీవా సృజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేస్ 1 కింద పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేసి ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వాలని కర్నూలు జిల్లా జనసేన నేత నక్కల మిట్ట శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..వైసిపి ప్రభుత్వం జిఓ నెంబర్ 365 పేరిట 2020 లొనే ఈ ప్రాజెక్ట్ కింద చేపట్టాలిసిన పెండింగ్ పనులను నిలిపివేసిందన్నారు. జిల్లాలో పశ్చిమ ప్రా0తము ప0దికొన రిజర్వాయర్ కింద 60 వేల ఎకరాల కు సాగు కావలసిఉన్న.పనులు నిలిపివేతతో కేవలము 10 వేల ఎకరాలకు మించి సాగునీరు ఆదటం లేదన్నారు. జిల్లా మొతం ఆయకట్టు 80 వేల ఎకరాలు కాగా నేటి వరకు 20 వేల ఎకరాల కు మించి సాగునీరు ఇవ్వటం లేదన్నారు. నిధుల కొరతో తో ఈ ప్రభుత్వం 2020 లొనే పనులను నిలిపివేయడం పలిత0గా జిల్లాలో 60 వేల ఎకరాల్లో రైతులు వందల కోట్ల రూపాయల పంట సాగును కోల్పోవసి వస్తోదని ఆయన తెలిపారు.. పలిత0గా రైతు కూలీలే కాదు ఆయకట్టు రైతులు వలసబాట పట్టాదానికి వైసిపి ప్రభుత్వమే బాధ్యతన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వ హాయములో నిలిచిపోయిన పనులను వైసిపి ప్రభుత్వం చేపట్టివుంటే..పశ్చిమ ప్రా0తము లో రైతుల వలసలను నివారించ వచ్చున్నారు..ప0దికొన రిజర్వాయర్ లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని 1.126 టీఎంసీల కాగా.ప్రభుత్వం పెండింగ్ పనులు చేపట్టకపోవటం 0.70 టీఎంసీల కే పరిమితమై దన్నారు. రి జర్వాయర్ తోపాటు, పెండింగ్ పనులను చేపట్టి, ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్స్ వైసిపి ప్రజాప్రతినిధులకు పట్టవా అని ఆయన ప్రశించారు…వలసను నివారించేందుకు హంద్రీనీవా సృజల స్రవంతి ప్రాజెక్ట్ ను రూపొందించారని, ప్రాజెక్ట్ లక్షం అదేన్నారు. గత రెండు సంవత్సరాలు గా ఈ ప్రాజెక్ట్ పెండింగ్ పనులపై సంబంధిత ప్రజాప్రతినిధులు ఏనాడు సమీక్ష సమావేశం నిర్వహించిన దాఖలాలు కనిపించటం లేదన్నారు. ఇప్పటికయినా వైసిపి ఎమ్మెల్యేలు,ఎంపీ జోక్యం చేసుకొని కర్నూలు జిల్లాలో ప్రాజెక్ట్ కింద నిలిపివేసిన పనులను చేపట్టేలాగా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి…ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వాలని, లేని పక్షంలో జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి…రైతులతో కలసి. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని నక్కల మిట్ట శ్రీనివాసులు ప్రకటించారు..