బార షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అల్తాఫ్ బాబా

బార షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అల్తాఫ్ బాబా
నెల్లూరు సిటీ, మార్చి 26, (సీమకిరణం న్యూస్) :
నెల్లూరు జిల్లా కేంద్రంలో వెలసివున్న ప్రముఖ పుణ్యక్షేత్రం బారా షహీద్ దర్గా ను ఆహ్లే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో కన్వీనర్ అల్తాఫ్ బాబా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన శనివారం నెల్లూరు లోని బార షహీద్ దర్గాను సందర్శించారు , ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మషాయిక్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు అల్తాఫ్ బాబాను ఘన స్వాగతం పలికి శాలువాలు పూలమాలలతో సత్కరించారు అనంతరం బారాషహీద్ దర్గాలో ప్రత్యేక పార్ధనలు నిర్వహించారు, ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లో ఉన్న అన్నీ దర్గాల పీఠాధిపతులతో కలిసి దర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని వాటిలో భాగంగా ఈ రాష్ట్ర పర్యటన చేపట్టడం జరిగిందన్నారు అలాగే ప్రభుత్వాలు కూడా బాక్ఫ ఆస్తులను పరిరక్షించడానికి ఏర్పాటు చేసే వర్క్స్ బోర్డు ను దుర్గాలను మసీదులను ఆదరించే సున్ని జమాత్ కు సంబంధించిన వారిని నియమించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు… ఈ కారిక్రమంలో పధకాల పీఠాధిపతులు సైఫుద్దీన్ సాహెబ్ , సాని సాహెబ్ , జుబేర్ సాహెబ్ , ఇంజనీర్ అరిఫ్ , మరియు ఇతర సూఫీ మత గురువులు పాల్గొన్నారు .