తాగునీటి వసతి కల్పించండి : ఆర్ఏవిఎఫ్
ఎమ్మిగనూరు, మార్చి 26, ( సీమకిరణం న్యూస్ ) :
ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాలలో సుమారు వెయ్యి మంది గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో త్రాగు నీటి వసతి కల్పించాలని రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్ ఏ వీ ఎఫ్) జిల్లా కార్యదర్శి ఖాజా ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణాకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు తాగునీటి వసతి సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాగే క్యారియర్ బాక్సులు ప్లేట్లు కడుక్కోడానికి బయటి ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి విద్యార్థుల తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ మరియు జగదీష్ విద్యార్థులు పాల్గొన్నారు.