ANDHRABREAKING NEWSSTATE

త్రాగునీటి సమస్యపై సమగ్ర నివేదికలు ఇవ్వండి

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

త్రాగునీటి సమస్యపై సమగ్ర నివేదికలు ఇవ్వండి

నీటి ఎద్దడి నివారణకు సత్వర చర్యలు

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

కర్నూలు కలెక్టరేట్ , మార్చి 28, (సీమకిరణం న్యూస్)  : 

ఆదోని డివిజన్ లో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలను అన్వేషించి ఏ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు… త్రాగు నీటి వనరులు, పైప్ లైన్ రిపేర్లు, బోర్ల మరమ్మత్తులు, అవసరమగు బడ్జెట్  తదితర అంశాలపై క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి త్రాగు నీటి సమస్య నివారణకు తీసుకోవలసిన అంశాలపై అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా సంపూర్తి నివేదికలు తయారుచేసి రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆదోని డివిజన్ త్రాగునీటి సమస్యపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సి.హెచ్ విద్యాసాగర్, జిల్లా పరిషత్ సిఈఓ వెంకటసుబ్బయ్య, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆదోని డివిజన్ లోని 17 మండలాలు, 486 నివాసిత ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య రానీయకుండా త్రాగునీటి సరఫరా చేసేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి సమస్యపై వార్తా పత్రికల్లో వస్తున్న ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి అదే రోజు సాయంత్రంలోగా సంబంధిత ప్రతికూల  వార్తలపై వాస్తవ నివేదికను అందజేయాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ డిఈలను ఆదేశించారు. త్రాగు నీటి వసతి కల్పనలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అలసత్వం ప్రదర్శించకుండ క్రింది స్థాయి సిబ్బందితో సమీక్షలు నిర్వహించుకొని నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ విధంగా పనులు చేపడితే త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించి ప్రత్యామ్నాయ వనరులు గుర్తించి సంబంధిత నివేదికలు తయారుచేసి ఇవ్వాలన్నారు. నీటి సమస్య ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదని త్రాగునీటి వనరులను గుర్తించి నీటి సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బోర్ల ఫ్లషింగ్, డీపెనింగ్, హైరింగ్ బోర్లు, పైపులైన్ల మరమ్మతులు తదితర పనులను వెంటనే చేపట్టి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న 58 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీటి పైపులైన్లలో మరమ్మతులు వుంటే వెంటనే పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈవోను కలెక్టర్ ఆదేశించారు.  ర్యాండమ్ గా కాకుండా గ్రామాల వారీగా త్రాగు నీటి సదుపాయాన్ని కల్పించే ప్రతి స్కీమును పరిశీలించి సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. త్రాగు నీటి ఎద్దడి నివారణకు నీటి వనరులను గుర్తించాలని ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి ని కలెక్టర్ సూచించారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!