
నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో జీవించండి
కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మణి గాంధీ!!
కర్నూలు ప్రతినిధి, డిసెంబరు 31, (సీమకిరణం న్యూస్):
నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ అన్నారు. బుధవారం స్థానిక కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నివాసంలో ముందస్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు మౌలాలి ప్రసన్న చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి పట్టణ కన్వీనర్ అబెల్ వైసిపి నాయకులు సంపత్ సురేష్ అలీ నాగరాజు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.




