
దటీజ్ పవన్ .. ఆదేశిస్తే గంటల్లో జరిగిపోవాలి !
అమరావతి/ సీమకిరణం న్యూస్ :
రాజకీయ నేతలు హామీలు ఇస్తారు..కానీ అవి అమల్లోకి వచ్చేటప్పటికి ఎంత కాలం పడుతుందో చెప్పలేరు. ఈ పద్దతిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్చేస్తున్నారు. తాను ఇలా ఆదేశాలు ఇచ్చానంటే అలా వెంటనే అమలు జరగాలన్న పద్దతిలో పని చేస్తున్నారు. దానికి తాజా సాక్ష్యం.. అంధ మహిళా క్రికెటర్లకు ఇచ్చిన హామీలు గంటల్లో పూర్తి కావడం. రెండు రోజుల కిందట పవన్ కల్యాణ్ ను ప్రపంచకప్ గెల్చినా అంధ మహిళా క్రికెటర్ల టీమ్ కలిసింది. క్యాంపు ఆఫీసులో వారిని సన్మానించి వ్యక్తిగతంగా తలా ఐదు లక్షలు రూపాయల సాయం కూడా చేశారు. ఆ క్రికెటర్లలో ఇద్దరు తెలుగు వారు ఉన్నారు. ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన వారు..మరొకరు మన్యం జిల్లాకు చెందిన వారు. వారివి నిరుపేద కుటుంబాలు కావడంతో తమ పరిస్థితుల్ని వారు పవన్ కు చెప్పుకున్నారు. మన్యం మహిళా క్రికెటర్ తమ ఊరికి రోడ్డు గురించి ప్రస్తావించారు. వెంటనే రోడ్డు వేసేలా పవన్ ఆదేశాలు ఇచ్చారు.కేవలం ఆదేశాలకే పరిమితం కాలేదు. అధికారికంగా జీవో వచ్చింది. వెంటనే పనులు ప్రారంభించనున్నారు. ఇద్దరు క్రికెటర్ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని తెలియడం.. వారికి కనీస మౌలిక వసతులు లేవని గుర్తించి పార్టీ పరంగా సాయం అందించాలని ఆదేశించారు. వెంటనే పార్టీ నేతలు సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో కరుణ కుమారి కుటుంబానికీ టీవీ, టేబుల్ ఫ్యాను, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేటులు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్.ఇ.డి. బల్బులు, పాత్రలు, దుప్పట్లు, దిండులు, కుటుంబం మొత్తానికి దీపిక, కరుణ కుమారి వేదనకు చలించిపోయి వారి కుటుంబాలకు గృహోపకరణాలు, నిత్యావసరాలను తక్షణమే సమకూర్చాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు వాటిని కొనుగోలు చేసి ఆయా కుటుంబాలకు పంపించారు. ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి తగిన విధంగా డైనింగ్ టేబుల్స్, మంచాలు లాంటి మరికొన్ని గృహోపకరణాలు సమకూర్చాలని నిర్ణయించారు. అన్ని బాగున్న వాళ్లే ఏదో ఓ సాయం కోసం వస్తూంటారు. కానీ అంధులైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఉంటూ ప్రపంచకప్ గెలిచిన వారికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. ఆ మేరకు అమలు చేసేశారు. పవన్ మాట ఇస్తే ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని నిరూపించారు.




