చదివిస్తే చదువుకుంటా స్పందించిన విద్యాశాఖ అధికారులు
ఆ విద్యార్థికి స్పెషల్ సీటును కేటాయించిన జిల్లా విద్యా అధికారి
గోనెగండ్ల , జులై 25 , ( సీమకిరణం న్యూస్ ) :
గోనెగండ్ల మండల పరిధిలోని చిన్నమర్రివేడు గ్రామానికి చెందిన బోయ సింధు ఎనిమిదో తరగతి వరకు గ్రామంలో చదువుకుంది 9వ తరగతి చదువుకోవడానికి కేజీబీవీ పాఠశాలకు దరఖాస్తు చేసుకున్నారు కానీ సీటు రాకపోవడంతో సీటు కేటాయించాలని లేకపోతే పొలం పనులకు పోతానని తల్లిదండ్రులు తెలపడంతో వార్త పత్రికల్లో ప్రచురితమైనది దానిని చూసి స్పందించిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆదేశాల మేరకు కేజీబీవీలో వెంటనే సీటు కేటాయించాలని డి ఈ ఓ కు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాముల్ పాల్ గోనెగండ్ల కేజీబీవీ పాఠశాలకు తనిఖీ చేసి జిల్లా కలెక్టర్, డి ఈ ఓ ఆదేశాల మేరకు ఆ విద్యార్థికి కేజీబీవీలో 9వ తరగతి సీటు స్పెషల్ గా కేటాయించి గోనెగండ్ల ఎంఈఓ కు ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. ఆ విద్యార్థికి ఈరోజు నుంచే పాఠశాలకు జాయిన్ కావచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆయన తెలిపారు బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు నీలకంఠ రామాంజనేయులు కేజీబీవీ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.