నగర పంచాయతీలో వేలం పాటలు
నగర పంచాయతీలో వేలం పాటలు
: కబేలాల వేలం పాటలో గందరగోళం
బేతంచెర్ల , మార్చి 24, (సీమకిరణం న్యూస్) :
స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం కమీషనర్ రమేష్ బాబు అధ్యక్షన వేలం పాటలు నిర్వహించారు. బండ్ల మెట్ట వేలం పాట లో ఇరువురు అభ్యర్థులు హోరా హోరీగా వేలం పాల్గొనగా చివరకు సూర్య చంద్రా రెడ్డి రూ.23.72 లక్షలకు దక్కించు కున్నారు. సంత మార్కెట్ వేలం పాటలో ఇరువురు అభ్యర్థులు వేలంలో పాల్గొన్నప్పటికి గతేడాది దక్కించుకున్న నాగేశ్వరరెడ్డికే రూ.10.62 లక్షలకు దక్కింది.అయితే కబేలాల వేలం పాటలో మాత్రం కొంత సేపు గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. కబేలాల వేలం పాటలో పాల్గొనేందుకు ఒక్క అభ్యర్థే ముందుకు రావడంతో అధికారులు,ఇరువురు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీదారులు ఉంటే తప్ప నిర్వహించమని తెగేసి చెప్పారు. గత్యంతరం లేని పక్షంలో మరొక అభ్యర్థితో డిపాజిట్ కట్టించుకొని, ఇరువురు వేలం పాటలో ఉన్నారంటూనే ఎటువంటి వేలం పాట నిర్వ హించకుండా గతేడాది దక్కించుకున్న సంథానికే రూ 1,85, 500లకు అధికారులు కేటాయించారు. ఇంత తర్జనభర్జన లు,గందరగోళం మధ్య సాగిన కబేలాల వేలం పాటలపై పట్టణ ప్రజలు చర్చించుకోవడం గమ నార్హం. ఈ వేలం పాటలలో సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్ నాయక్, జూనియర్ అసిస్టెంట్ రాజేష్,సిబ్బంది రమణ, మధు, తదితరులు పాల్గొన్నారు.