ధ్వజస్తంభ ప్రతిష్ట 41 రోజు పూజ
ధ్వజస్తంభ ప్రతిష్ట 41 రోజు పూజ
ఆదోని గంగాభవాని ప్రధాన అర్చకులతో పూజ నిర్వహించడం జరిగింది.
శ్రీ ఆంజనేయ ఈశ్వర స్వామి దేవాలయం నందు.
పెద్దకడబూరు, మార్చ్ 24, ( సీమకిరణం న్యూస్) :
పెద్దకడబూరు మండలం నౌలేకల్ గ్రామంలో ధ్వజస్తంభ ఈరోజుతో 41 రోజు పూజలు ముగియడంతో గ్రామంలో పూజలు నిర్వహించడం జరిగింది గంగాభవాని ప్రధాన అర్చకులచే నిర్వహించడం జరిగింది. అందుకు గాను గ్రామ పెద్దలు గోరుకలు మాజీ సర్పంచ్ జయలక్ష్మి మరియు గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ కుమార్ చేతులు మీదుగా పూజ నిర్వహించడం.జరిగింది ఆకు పూజ కుంకుమార్చన పాలాభిషేకం ధ్వజస్తంభ ప్రతిష్టాపన పూజలు నవధాన్యాలు అన్నదాన కార్యక్రమం గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు ఇంటింటికి టెంకాయలు కొట్టి పూలమాలను వేసి పూజ ని ప్రతిష్టంగా నిర్వహించడం జరిగింది మరియు కోలాటలు ఆటపాటలతో సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరిగినది. మరియు గుడి గోపుర గుడి ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు సుమారుగా 90 లక్షలు ఖర్చు అయిందని గ్రామ పెద్దలు తెలియజేశారు మరియు గ్రామ పెద్దలు గోరుకల్ ఫ్యామిలీ ఒక్కటే ధ్వజస్తంభాన్ని చేయించడం జరిగిందని అందుకు 10 లక్షలు ఖర్చు సొంతంగా పెట్టినారు మరియు గుడి నిర్మాణానికి గాను ఒక 8 లక్షలు దాకా ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామ పెద్దలు తెలియజేశారు. గ్రామ ముఖ్య నాయకులు అనిల్ కుమార్ నరేష్ కుమార్ గుడిని ముందుండి అన్ని విధాలుగా సౌకర్యాలు చూస్తూ ముందుకు నడిపించారని గ్రామ ప్రజలు తెలిపారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు. ఆంజనేయ నాగరాజు మానప్ప శరణప్ప వైస్ సర్పంచ్ అనుమప్ప తిక్కన్న హనుమంతు పరిషప్ప తిమ్మారెడ్డి భీమన్న వెంకటేష్ నరసయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.