
ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి
మండల టిడిపి నాయకులు
ప్యాపిలి, జూలై 20, (సీమకిరణం న్యూస్) :
రానున్న రోజుల్లో టీడీపీదే గెలుపు అని, దీని కోసం ప్రతి నాయకులు,కార్యకర్తలు కష్టపడి పని చేయాలని టిడిపి నాయకులు అన్నారు. ప్యాపిలి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మండల అధ్యక్షులు గండికోట రామ సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు చిన్న సుంకయ్య అధ్యక్షతన గురువారం క్లస్టర్, యూనిట్, పోలింగ్ బూతు ఇంచార్జీలకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర, సీనియర్ టిడిపి నాయకులు లక్ష్మీ నారాయణ యాదవ్, ధర్మవరం మన్నే పెద్ద నాగిరెడ్డి, రాంమోహన్ యాదవ్ , ఎర్రగుంట్లపల్లె వేంకటేశ్వర రెడ్డి , అంకిరెడ్డి , డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి , జలదుర్గం విష్ణు,ఖాజాపీర్
,ప్యాపిలి మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి సుదర్శన్ , క్లస్టర్ ఇంచార్జ్ శరఫ్ మధుసూదన్ , బంకు నాగేంద్ర , యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జులు ప్యాపిలి మండలం టిడిపి నాయకులు పాల్గొన్నారు.