
పింఛన్ మొత్తంతో పరారైన ఉద్యోగి సస్పెన్షన్, అరెస్ట్
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి, ఆగస్ట్ 02, (సీమ కరణం న్యూస్):
పింఛన్ సొమ్ముతో పరారైన వెంగళంపల్లి సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ పవన్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్యాపిలి మండలం వెంగళంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పథకం కింద 50 మంది పెన్షన్ దారులకు పంపిణీ చేయవలసిన మొత్తం రు. 2,23,500 లతో పరారైన సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ పవన్ కుమార్ ను సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. సంబంధిత మొత్తాన్ని తల్లితండ్రులను పిలిపించి వసూళ్లు చేయడం జరిగిందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి బాధ్యతారహితంగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తీవ్ర కట్టిన చర్యలు తీసుకుంటామని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.