నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు : ఎస్ ఎఫ్ ఐ
నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు : ఎస్ ఎఫ్ ఐ
కోసిగి, మార్చి 23, ( సీమకిరణం న్యూస్) :
అక్రమ అరెస్టులు, నిర్బంధాల తో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం.ఎల్లప్ప అన్నారు. బుధవారం ఇంటి వద్ద ఉన్న ఎం.ఎల్లప్పను పోలీసులు ఈ నెల 24న చలో విజయవాడకు వెళ్లనీయకుండా ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం.ఎల్లప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అడిగితే అరెస్టులు చేయడం దారుణమన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రైవేట్ పీజీ విద్యార్థులకు వసతి దీవెన, విద్య దీవెన ఇవ్వాలని, అమ్మ ఒడి నిధులు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా సొంత భవనాలు లేని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, 3,4,5 తరగతుల విలీనం ఆపాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 42,35 రద్దుచేసి ఎయిడేడ్ విద్యాసంస్థలను కొనసాగించాలని, పరిశోధక విద్యార్థులకు నెలకు ఎనిమిది వేల రూపాయలు ఫెలోషిప్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. న్యాయమైన విద్యారంగ సమస్యలు పరిష్కరించమని అడిగితే ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం అన్నారు. నిర్బంధాలు కొనసాగితే విద్యారంగ వ్యతిరేక విధానాలకు పోరాటాల నిర్వహిస్తామన్నారు.