డాక్టర్ ఎన్.టి.కె. నాయక్ ను సన్మానించిన కైలాస్ నాయక్
పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం మెరుగైన విద్యను అందించాలని కోరిన కైలాస్ నాయక్
కర్నూలు ప్రతినిధి, జూలై 20, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీ లో డాక్టర్ ఎన్.టి.కె. నాయక్ సేవలు గుర్తించిన ప్రభుత్వం రాయలసీమ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్లర్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కైలాస్ నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సభ్యులు కలిసి శాలువా కప్పి పూల బొకేలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కైలాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలకు ఇన్చార్జి వైస్ ఛాన్సర్లను నియమించడం జరిగిందని అందులో భాగంగా దాదాపుగా మూడు దశాబ్దాలుగా వివిద పదవులను అలంకరిస్తూ మొదటగా పీజీ సెంటర్ లెక్చరర్ గా మొట్టమొదటి రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ గా మూడు పర్యాయాలు పని చేశారనీ అన్నారు. అలాగే యూనివర్సిటీ ప్రిన్సిపల్ గా పనిచేస్తూ చెంచుల అభివృద్ధి కోసం పీహెచ్డీ చేసి డాక్టరేట్ గ్రహీతగా యూనివర్సిటీ డీన్ గా యూని వర్సిటీ సెక్టార్ గౌరవ సభ్యులుగా పని చేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే ఎన్ నూతన ఇన్చార్జి వైస్ ఛాన్స్లర్లు గా నియమితులైన ఎన్ టి కే నాయక్ తో కైలాస్ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డిగ్రీ పీజీ చదువులు చదివే పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం మెరుగైన విద్యను సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ ట్రైబ్స్ ఉద్యోగ సంఘం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నేనావత్ రాము నాయక్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్, ప్రభుత్వ సర్వజన నాయకులు.యన్. బాలు నాయక్, ఎల్లయ్యగారి జయరాం నాయక్, నాయకులు కలిశారు.