ఘనంగా తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం
ఎమ్మిగనూరు , మార్చి 29 , ( సీమకిరణం న్యూస్ ) :
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం నాడు 22 వార్డు సమీపంలో మాజీ ఎమ్మెల్యే బి.వి జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాలనుసారం గా మాజీ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు , మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి మాట్లాడుతూ పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీని కొనియాడారు అభివృద్ధి తెలుగుదేశం తోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అంజీర్ ముల్లా రఫీక్, అబ్దుల్లా, రామకృష్ణ, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు