నీరు కలుషితం కాలేదు : ఆర్డబ్ల్యూఎస్ సి
ఫుడ్ పాయిజన్తో వ్యక్తి మృతి, మరో పదిమంది అశ్వస్థత
గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి.
ఆత్మకూరు, మే 17 , ( సీమ కిరణం న్యూస్) :
మండలం లోని మద్దూరు మజరా గ్రామమైన కృష్ణానగర్ గ్రామంలో పెళ్లి విందు భోంచేసిన వారికి ఫుడ్ పాయిజన్ అవడంతో ఓబులేసు(28) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం మరణించి పలువురు అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది, స్థానికులు అధికారుల వివరాల మేరకు ఈనెల 9వ తేదీన ఉష అనే మహిళ ఇంట్లో వివాహ వేడుకలు జరిగాయి వేడుకల అనంతరం ఆదివారం నాడు బంధువులతో కలిసి వారి కుటుంబ సభ్యుల వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నట్లు తెలిపారు రాత్రి అస్వస్థత కు గురికావడంతో విరోచనాలు వాంతులు ఉండడంతో ఓబులేసు, సామేలు, వెంకటస్వామి, ఉష కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యశాలకు సోమవారం ఉదయం వెళ్లారు సాయంత్రానికి ఓబులేసు కోలుకోలేక మృతి చెందాడు వెంకటస్వామి, సామేలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు మరో ప్రక్క గ్రామంలో చిన్నపిల్లలు హర్షవర్ధన్, సందీప్ లను పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు చికిత్స అందించారు, మంగళవారం నాడు మహాలక్ష్మి, నాగేంద్ర, రామన్న లను పాములపాడు ఆరోగ్య వైద్య కేంద్రం లో కేంద్రంలో వైద్యం అందిస్తున్నారు కృష్ణానగర్ గ్రామాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్సీ మనోహర్, తాసిల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో ఎం రాణెమ్మ, వైద్యాధికారులు రోష్ని, నాగ లక్ష్మి దేవి సందర్శించి కుటుంబ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఫుడ్ పాయిజన్ కారణం ప్రాథమిక అంచనా: జిల్లా వైద్యాధికారి- ఫుడ్ పాయిజన్ కారణం ఉండొచ్చని ప్రాథమిక అంచనా వచ్చినట్లు ఆర్ వెంకటరమణ తెలిపారు, గ్రామంలోని నీటిని టెస్టింగ్ కోసం శాంపిల్స్ పంపించామని మరణించిన వ్యక్తి ఇంటి లోపల బ్లీచింగ్ శానిటేషన్ చేయించమని పరిసర ప్రాంతాలను బీజింగ్ చలించి వారం రోజుల పాటు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు 104 ,108 వాహనాలను అందుబాటులో ఉంచామని గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా నీటిని వేడి చేసుకుని త్రాగాలని అదేవిధంగా వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నీరు కలుషితం కాలేదు : ఆర్డబ్ల్యూఎస్ సి :
కృష్ణానగర్ గ్రామంలో నీరు ఎలాంటి కలుషితం కాలేదని ఆర్డబ్ల్యూఎస్ ,ఎ ఈ,సిహెచ్ మనోహర్ తెలిపారు గ్రామంలో అధికంగా హ్యాండ్ బోర్లు ఉన్నాయని రెండు ఒవరైడ్ ట్యాంకులు ఉన్నాయని ట్యాంక్ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ నామని ఎలాంటి నీరు కలుషితం కాలేదని ఫుడ్ పాయిజన్ వల్ల నే విరోచనాలు జరిగాయని అయినప్పటికిని నీటిని శాంపిల్స్ పంపించామని ఆయన తెలిపారు.