ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు
నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, కర్నూలు ఎంపీ, కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు
అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .సృజన
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్):
అట్టడుగు వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. శుక్రవారం భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ 132 వ జయంతి మహోత్సవం పురస్కరించుకొని కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ దగ్గర గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ , కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, నగర డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని శరీన్ నగర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ,మహాత్మ జ్యోతిరావు పూలే,విగ్రహాలకు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బీసీ ప్రజాసంఘాల నాయకులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన వేదికపై జయంతోత్సవం కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. అంబేద్కర్ మార్గం అనుసరణీయమని అన్నారు. భారత దేశ రాజ్యాంగ నిర్మాణం కోసం అవిరళ కృషి చేసిన బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చే దిశలో పయనించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికి నిలిచిపోయిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. అట్టడుగు వర్గంలో జన్మించి అదే అట్టడుగు వర్గాల వారికి దిశ దశ నిర్దేశం చేసి ఎత్తుకు ఎదిగిన ఆయన జీవితం గురించి మనం తెలుసుకోవాలని స్ఫూర్తి పొందాలని ఆయన నడిచిన దారిలోనే మనము నడవాలని సమాజంలో కుల మతాలకు అతీతంగా కాకుండా ప్రతి మనిషిని మనిషి గౌరవించుకోవాలని, ఆయన తెలిపిన పాఠాలను పూర్తిగా మనం గమనించాలని, పోరాటాలకు భయపడకుండా మన హక్కుల సాధనకు భయపడకుండా ధైర్యమును వారి నుండి తీసుకొని భావితరాల వారికి అందించి సమాజానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు.దేశ భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి, వాటి పరిష్కర మార్గాలను రాజ్యాంగంలో పొందుపరిచిన దార్శనికుడని కొనియాడారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి భారతీయులందరికీ పండగ రోజు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. నేటి విద్యార్థులు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కుల మతాలకతీతంగా ఐక్యతతో ముందుకు సాగాలన్నారు, పార్లమెంటు సభ్యులుగా మన కర్నూలు నియోజక వర్గం నుండి దాదాపుగా ఏడు రకాల బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు, జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అయినా ఆదోని పరిసర ప్రాంతాల ప్రజలు వలసలు పోకుండా ఉండుట కొరకు వారి జీవనోపాదులపై కూడా పార్లమెంటులో చర్చించడం జరిగిందన్నారు, కర్నూలు లో అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎంపీ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఇంకా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొని వేస్తే పార్లమెంటులో చర్చిస్తానని తెలియజేశారు. బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన నడిచిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. ఏం చేయాలనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంకల్పించారో ఆ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలలోను వెనకబడిన తరగతుల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే సమయంలో అట్టడుగు వర్గాల సమస్యలు పరిష్కరించి వారిని అభివద్ధి బాటలో నిలిపేందుకు ప్రాధాన్యత ఇచ్చారని అంబేద్కర్ జయంతి బడుగు, బలహీన వర్గాల వారికి పండగరోజు అన్నారు. భారతదేశం రాజ్యాంగం లాగా ఉండాలని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. మనదేశంలో యువత ఎక్కువ శాతం వున్నారని యువత బాగుంటేనే జిల్లాలు, రాష్ట్రాలు, దేశం బాగుంటుందని దేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛగా బ్రతకాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 98 శాతం పనులను పూర్తి చేసిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్ డిఓ హరి ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డిడి ప్రతాప్ సూర్య నారాయణ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ కుమార్, డిఆర్డిఎ పిడి వెంకటసుబ్బయ్య, సెట్కూరు సీఈఓ రమణ,సిపిఓ అప్పలకొండ,జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, కేడిసిఎంఎస్ చైర్ పర్సన్ శ్రీమతి శిరోమణి మద్దయ్య, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మాజీ మేయర్ బంగి అనంతయ్య, డివిఎంసి మెంబర్స్ ,మరియు వివిధ కుల సంఘాల ప్రజాసంఘాల ప్రతినిధులు వై జయరాజు, సిహెచ్ మద్దయ్య, ఎన్. బజారన్న, రెడ్డి పోగు రాజకుమార్, అనంతరత్నం, కొమ్ముపాలెం శ్రీనివాసులు, బాల సుందరం, నాయకల్లు సోమసుందరం, శ్రీమతి వేల్పుల జ్యోతి, శ్రీమతి హన్నమ్మ, ఆర్ జె ప్రకాష్ మాదిగ, నక్కల మిట్ట శ్రీనివాసులు, అర్. కైలాష్ నాయక్, బాబు రాజ్, రామచంద్రనాయక్, వెంకటేశ్వర్లు, డి మహేష్, డి గోపి, పి రాజీవ్ కుమార్, సి. లక్ష్మన్న, డి ప్రవీణ్ కుమార్, రెడ్డి పోగు విజయకుమార్, ఈ .రవిశంకర్, ఎం రాజన్న, పి బతుకన్న, వేల్పుల విజయ్ కుమార్, ఎం సురేష్, జి వెంకటేశ్వర్లు, ఆర్ చంద్రప్ప, బాబుజి, తదితరులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గురించి ప్రసంగించారు