
జగన్ విధ్వంస పాలనతో వ్యవస్థలన్నీ నాశనం
రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమ పథకాలు అందించేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే
-: జొన్నగిరి ఎన్నికల ప్రచారంలో విమర్శనాస్త్రాలు సంధించిన టిడిపి అభ్యర్థులు
కర్నూలు ప్రతినిధి ఏప్రిల్ 28, (సీమకిరణం న్యూస్):
జగన్ విధ్వంస పాలనతో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసాడని కర్నూలు పార్ల మెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కే.ఈ. శ్యామ్ బాబులు విమర్శనాస్త్రాలు సంధించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లోని జొన్నగిరిలో కేఈ శ్యాంబాబు తో కలిసి నాగరాజు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా నాగరాజు మాట్లాడుతూ ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ తన సైకో తనంతో అన్ని వర్గాల ప్రజలను కష్టాలోకి నెట్టేసారని ఆరోపించారు. సొంత కుటుంబాన్ని పాలించలేని జగన్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. తుగ్లక్ జగన్ ను గద్దె దింపేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. నష్ట పోయిన వాటి స్థానాలను తిరిగి వాటి స్థానాలు యధాస్థితికి తీసుకురావాలన్నా, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్న అది ఒక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే సాధ్యమని పునరుద్గాటించారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లను సైకిల్ కి వేసి ఎం.పి గా తనకు, ఎమ్మెల్యే గా కేఈ శ్యాంబాబును గెలిపిస్తే ఇద్దరం కలిసి పత్తికొండ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జొన్నగిరి సర్పంచు ఓబులేసు, మాజీ జెట్పీటీసీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, తుగ్గలి నాగేంద్ర, జొన్న గిరి టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.