ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
800 మంది పోలీసులతో భారీ బందోబస్తు
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
బందోబస్తుకు విచ్చేసిన పోలీసులకు దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్, ఆగస్టు 30, (సీమకిరణం న్యూస్):
పింఛన్ల పంపిణీ కార్యక్రమం సంధర్బంగా కర్నూలు జిల్లా , పత్తికొండ మండలం, పుచ్చ కాయల మడ గ్రామంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగష్టు 31న రానున్న నేపథ్యంలో పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పత్తికొండ మండలం, పుచ్చ కాయల మడ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించే రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, హెలిపాడ్, సభ సమావేశ ప్రాంగణం, తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు , స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు , పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. చేయకూడనవి, చేయవలసిన వాటికి గురించి తెలిపారు.
అనంతరం సి ఎం కాన్వాయ్ రిహార్సల్స్ ను , హెలిప్యాడ్, ముఖ్యమంత్రి సభ ప్రాంగణం వద్ద జిల్లా ఎస్పీ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
అడిషనల్ ఎస్పీ ఒకరు, 6 మంది డిఎస్పీలు, 30 మంది సిఐలు, 43మంది ఎస్సైలు, 154 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు , 247 మంది కానిస్టేబుళ్ళు , 28 మంది మహిళా పోలీసులు, 150 మంది హోంగార్డులు, 3 సెక్షన్ల ఏ ఆర్ సిబ్బంది, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు. జిల్లా ఎస్పీతో పాటు కడప జిల్లా ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణరావు, డిఎస్పీలు వెంకట్రామయ్య, శ్రీనివాసాచారి, కృష్ణమోహన్, సోమన్న, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, సిఐలు, ఎస్సైలు , పోలీసు సిబ్బంది ఉన్నారు.