జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి.. ఆరాధిస్తారు.
మంత్రి వాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూ జెఎఫ్)
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్) :
జర్నలిస్టులపై మంత్రి చెల్లోబోయిన వేణుగోపాల్ వేసిన సెటైర్లు పైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఎపి డబ్ల్యూ జె ఎఫ్ కర్నూలు జిల్లా కమిటీ స్పందించింది.జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తే ఎవరినైయినా ఆరాధిస్తారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.సమస్యలు పరిష్కరించకుండా ఆరాధించాలంటే కుదరదని ఎపిడబ్ల్యూ జె ఎఫ్ తెలిపింది.నాటి నుండి నేటి వరకు జర్నలిస్టులు ముఖ్యమంత్రులను, మంత్రులను రాజకీయ నాయకులను,ఆరాధిస్తూనే ఉన్నారని మీ ప్రభుత్వం కూడా ప్రజలు, జర్నలిస్ట్ ల సమస్యలు పరిస్కారం వైపుగా చర్యలు చేపడితే ముఖ్యమంత్రిని ఆరాధిస్తారని ఫెడరేషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. నాడు స్వాతంత్రోద్యమంలో సత్యం, ధర్మం కోసం నిలబడి స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రభోస్, అల్లూరి సీతారామరాజు బాలాగంగాధర్ తిలక్, సర్దార్ వల్లబాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రు లాంటి ఎందరో మహాను బావులను ఆరాధించిన చరిత్ర జర్నలిస్టులకుందని ఎపి డబ్ల్యూ జె ఎఫ్ గుర్తు చేసింది.ఎలాంటి లాభాపెక్ష లేకుండా నిస్వార్థంతో ప్రజల పక్షాన ఉంటూ జర్నలిస్టులు పని చేస్తున్నారని, ప్రభుత్వానికి, ప్రజలకు వారధి గా ఉంటూ ప్రజలకు ఉపయోగకరమైన అంశాలను ప్రభుత్వం తరుపున వార్తలు రాస్తూనే ఉన్నారని ప్రత్యేకంగా ఆరాధించాల్సిన అవసరం లేదని జర్నలిస్ట్ ల పక్షాన ఫెడరేషన్ భావిస్తుంది.మీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్న నేటికి జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. జర్నలిస్ట్ లకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు., ఇంకా అనేక మంది అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు,చిన్న పత్రికలలో పని చేసే అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదు. ప్రజల్లో భాగమైన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రి ని తన లాగా జర్నలిస్టులు ఆరాధించాలని, అరా తీయొద్దని మాట్లాడటం హాస్యాస్పదం. ఇప్పటికైనా వర్కింగ్ జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరానికి చొరవ చూపితే సి ఎం ను ఆరాధిస్తారని సమాచార, సినీ ఫొటో గ్రఫీ, బీ సి సంక్షేమ శాఖ మంత్రి చెల్లోబోయిన వేణుగోపాల్ కు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( ఎపి డబ్ల్యూ జె ఎఫ్ ) సూచించింది.
టి. మద్దిలేటి
రాష్ట్ర కార్యదర్శి ఏపీ డబ్ల్యూ జె ఎఫ్
బి. గోరంట్లప్ప
జిల్లా కార్యదర్శి
డి. మౌలాలి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్
చిన్న రామాంజనేయులు ఆర్గనైజింగ్ కార్యదర్శి
బసప్ప జిల్లా ఉపాధ్యక్షులు