కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన డాక్టర్ బైరెడ్డి శబరి

దామగట్ల లో కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి
నందికొట్కూరు, ఏప్రిల్ 16 , ( సీమకిరణం న్యూస్ ) :
శనివారం నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తర్వాత దామగట్ల ప్రజలు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అలాగే కబడ్డీ టోర్నమెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తర్వాత ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి ఆడితే విజయం మీ సొంతం అవుతుందని తెలిపారు. క్రీడలు దేశాభివృద్ధి ని, క్రీడాకారుల జీవితాలను కాపాడతాయని అని తెలిపారు అలాగే గ్రామ ప్రజలందరికీ పలకరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి కొండే పోగు చిన్న సుంకన్న, నిర్వాహకులు నందికొట్కూరు మండల బిజెపి అధ్యక్షులు కిషోర్, రాజు, నాగన్న, బీజేవైఎం నందికొట్టుకురు మండల అధ్యక్షులు శివ,మండల బీజేవైఎం అధ్యక్షులు వెంకటేష్, కార్తీక్, బైరెడ్డి అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు