జిల్లాలో పెద్ద ఎత్తున 2లక్షల మొక్కలు నాటడానికి చర్యలు
జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు
జిల్లాలో పెద్ద ఎత్తున 2లక్షల మొక్కలు నాటడానికి చర్యలు
జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు
బాపట్ల , జూన్ 05, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో పెద్ద ఎత్తున 2లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు వెల్లడించారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఒకే రోజు రెండు లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నామన్నారు.జిల్లాలో 25మండలాల్లో నిన్న సాయంత్రానికిఒక లక్ష70వేల మొక్కలు నాటడానికి గుంటలు తీయడము జరిగిందన్నారు. జిల్లాలో ప్రతి మండలం లో ఒక గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రజలు అందరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాని కాపాడాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.రోజా,అదనపు ఎస్.పైపు.మహేష్,డి.ఎస్.పి ఏ.శ్రీనివాసరావు, డ్వామా పి.డి ఉషారాణి, ఉద్యాన శాఖ ఏ.డి కృష్ణా రెడ్డి,ఆర్.&బి ఎస్.ఇ కిషోర్ బాబ్జి,బాపట్ల ఆర్.డి.ఓ రవీంద్ర, తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, అటవీశాఖ అధికారులు బాలకృష్ణ, శివరామ కృష్ణ, కలెక్టరేట్ అధికారులు, పాల్గొన్నారు