అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలి
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు
కృషి చేయాలి
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 12, (సీమకిరణం న్యూస్) :
ఈనెల 14న జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 14వ తేదీన డాక్టర్ బి అర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ , మరియు కుల సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, డిఆర్ఓ నాగేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డిడి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి,
పాల్గోన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యునిగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్ మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ముఖ్యంగా గిరిజన ఆవాసాలలో తాండాలలో ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్థానిక మెజిస్ట్రేట్ తాసిల్దార్ అయినటువంటి అధికారిచే అంబేద్కర్ గారి వేడుకలు జరిపి ఆయన ఆశయ సాధనకు కోసం అందరు కృషి చేయవలసిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రజలను చైతన్య పరచే బాధ్యత స్థానిక గ్రామాలలో అధికారికంగా అంబేద్కర్ జయంతి చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కైలాస్ నాయక్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల 14వ తేదీ జరిగే బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాన్ని ప్రతి తండాలో ప్రతి గిరిజన ఆవాసాలలో చదువుకున్న యువకులందరూ కూడా కలిసికట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని నిర్వహించాలని కోరారు.