
కర్నూలు టిడిపి ఎంపీ అభ్యర్థిగా రెండో దఫా నామినేషన్ దాఖలు చేసిన బస్తిపాటి నాగరాజు
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజనకు రెండు, మూడు సెట్ల నామినేషన్ పత్రాల అందజేత
…రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యం
.130 సార్లు బట్టన్ నొక్కాను అని చెప్పుకుంటు న్న జగన్ ను , ఒక్కసారి సైక్కిల్ బట్టన్ పై నొక్కి ఇంటికి పంపాలి – బస్తిపాటి నాగరాజు
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 22, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా రెండో దఫా నామినేషన్ దాఖలు చేశారు.. కర్నూలు కలెక్టరేట్ లోని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజనకు రెండు, మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎన్నడు లేని విధంగా ఈ సారి పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాక్షస పాలన సాగిస్తున్న జగన్ కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావనకాష్టం చేస్తాడని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవ సరం ఎంతైనా ఉందని.. ప్రతి సారి 130 సార్లు బట్టన్ నొక్కానని చెబుతున్న జగన్ కు .. ఎన్నికల్లో అందరూ ఒక్కసారి సైకిల్ బట్టన్ నొక్కి జగన్ ని ఇంటికి పంపాలన్నారు.. సొంత కుటుంబాన్ని పాలించలేని జగన్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. సొంత చెల్లెలు తన అన్నకు ఓటు వెయ్యొద్దని ప్రచారం చేస్తుండటం జగన్ అరాచక పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఇక కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఎంపీ తో పాటు 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని నాగరాజు తెలిపారు. అంతకు ముందు జిల్లా టిడిపి కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎం.ఎల్.సి బీ.టి నాయుడు, కర్నూలు , పత్తికొండ టిడిపి అసెంబ్లీ అభ్యర్థులు టీ.జి భరత్, కే.ఈ శ్యామ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.