
కంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే.. ఆకుకూరలు భుజించడం తప్పనిసరి
-: సెల్ ఫోన్లు… టీవీలకు దూరంగా ఉండాలి
-: సుశీల నేత్రాలయ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్
కర్నూలు ప్రతినిధి, జూన్ 30, (సీమ కిరణం న్యూస్):
మనిషికి కంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో నిత్యం ఆకుకూరలు ఉండే టట్లు చూసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సుశీల నేత్రాలయ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు పాత బస్టాండ్ ప్రాంతంలోని ఎస్.నాగప్ప వీధిలో మా సిరి సేవా సమితి కార్యాలయంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సేవా సమితి అధ్యక్షురాలు మాలతి, సుశీల నేత్రాలయ మరియు సాయి ఎడ్యుకేషనల్ సోసైటీ నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్. సుధాకర్ మాట్లాడుతూ సర్వేంద్రియాణం.. నయనం ప్రధానం మన పెద్దలు అన్న మాటలను గుర్తు చేశారు. మనిషికి అత్యంత విలువైన శరీర భాగాల్లో కళ్ళు అతి ముఖ్యమని.. అటువంటి కళ్ళకు సంబంధించిన వ్యాధులకు చికిత్స ఉచితంగా అందించడం సామాన్యమైన విషయం కాదన్నారు. నేటి సమాజంలో వయస్సుతో నిమిత్తం లేకుండా చాలావరకు కంటి సంబంధిత జబ్బులతో బాధపడుతున్న వారు అధికంగా ఉన్నారన్నారు. అలాంటి వారికి మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 80 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి.. కంటి మందులు పంపిణీ చేయడంతో పాటు.. అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు మా సిరి సేవా సమితి నిర్వాహకురాలు మాలతి ఈ సందర్భంగా వెల్లడించారు.