అసెంబ్లీలో పారిశ్రామిక అభివృద్ధిపై మాట్లాడిన మంత్రి టి.జి
అమరావతి బ్యూరో, నవంబర్ 14, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర పరిశ్రమలు-వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలమంత్రి టీజీ భరత్ గురువారం సభలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ,ఆంధ్రప్రదేశ్ పాలసీఫార్ ఎస్టాబ్లి ష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ 4.0 పాలసీలను తెస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ మాట్లాడుతూ గతంలో పారిశ్రామికవేత్తలు ఎక్క డైనా పరిశ్రమలు పెట్టండి కానీ ఏపీలో మాత్రం పెట్టొద్దు అనే వారని, అలాంటి దుస్థితిని గత పాలకులు తీసు కొచ్చారన్నారు. తాను దుబాయ్ ఎక్స్పోలో ఆంధ్రప్రదేశ్ ని ప్రమోట్ చేశానన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంపై 3.4 లక్షల కోట్లుగా ఉన్న స్థూల విలువ జోడింపును పాలసీ వ్యవధి ముగిసే నాటికి 7.3 లక్షల కోట్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, పాలసీ కాలంలో రూ.5 లక్షల కోట్ల విలువైన 15% నిర్వ హణలోకి తీసుకురావడం, పాలసీ కాలంలో రాష్ట్రానికి కనీసం 10 బిలియన్ యూఎస్ డాలర్ల ఎఫ్డిఐ లను ఆకర్షించడం, తయారీ రంగం నుంచి పాలసీ కాలంలో తొలిసారిగా 5 లక్షల ఉద్యోగాల కల్పన చేపట్టడం, అలాగే 175 పైగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఉన్న రాష్ట్రాన్ని స్పీడ్ఆఫ్ డూయింగ్ బిజి నెస్ గా తీసుకురావాలని సూచించారన్నారు.యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వేగవంతం చేయాలని సీఎం సూచించారన్నారు. అలాగే ఎం ఎస్ ఎం ఈ లను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. విధానపరమైన లక్ష్యాలను సాధించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రెండు కేటగిరీల ఫోకస్ సెక్టార్ గ్రూపులను గుర్తించిందని, అవి జీవనోపాధి మరియు చోదక రంగాలన్నారు. వాటిలో ఉత్పత్తి వ్యయం తగ్గిం చడం,వేగవంతమైన వ్యాపార నిర్వహణ కోసం వీలు కల్పించే ఆధారిత చొరవలు చేపట్టడం, ఎంఎస్ఎమ్ ఈలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయడం,పెట్టుబడుల ఆకర్షణను వేగవంతం చేయ డానికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం తదితరాలు ఉన్నాయి అన్నారు .ఇందులో భాగంగా రాష్ట్రం పెట్టు బడి వర్గాలను ప్రామాణిక పెట్టుబడి కాలాలతో 4 పెట్టు బడి కేటగిరీలుగా వర్గీకరించామని, సబ్ లార్జ్ ప్రాజెక్టు లు, భారీ ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టులు,అల్ట్రా మెగా ప్రాజెక్టులుగా వర్గీకరించామన్నారు. వీటికి రెండు నుండి నాలుగేళ్ళ పాటు ప్రామాణిక పెట్టుబడి వ్యవధి ఇచ్చామన్నారు. వాటితో పాటు ఉపాధి కల్పన, సబ్సిడీ డి కార్బనైజేషన్ ,సబ్సిడీ ఎర్లీ బర్డ్ ఆఫర్, విలువ ఆధారిత తయారీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కేటగిరి-1లో అర్హత షరతులను నెరవేర్చుతూ ఈ పాలసీని ప్రకటించిన 18 నెలల్లోగా సీఎఫ్ ఈనిఅందుకునే మొదటి 200 ప్రాజెక్ట్లకు ఎఫ్సీఐలో 30% పెట్టుబడి రాయితీ ఇస్తా మన్నారు. కేటగిరి టు లో విలువ ఆధారిత తయారీని ప్రోత్సహించడానికి ఏవేని పిఎల్ఐ పథకాల కింద ప్రోత్సాహం కోసం భారత ప్రభుత్వం గుర్తించిన రంగాలు, ఉప రంగాల్లో పెట్టుబడులు-అర్హత షరతులు నెరవేర్చిన వాటికి ఎఫ్సీఐలో 40 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పోటీ తత్వంతో కూడిన ప్రోత్సాహక ప్యాకేజీ పై రాష్ట్రం సంప్రదింపులు జరుపుతొందన్నారు. ప్రోత్సాహకాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం ఎస్క్రోవ్ ఖాతా ఆధారిత పంపిణీ యంత్రాంగానికి కృషి చేస్తుందన్నారు.