పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు
ఎస్సై నాగార్జున
ప్యాపిలి, నవంబర్ 24, (సీమకిరణం న్యూస్ ) :
రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నాగార్జున హెచ్చరించారు. ప్యాపిలి మండలంలోని జలదుర్గం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం స్టేషన్ సిబ్బందితో కలిసి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల జీవన విధానం, వారి కుటంబ స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా సత్ప్రవర్తనతో మెదలాలని సూచించారు. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేయడం మానుకోవాలన్నారు. శాంతిభద్రతలు, ప్రజల స్వేచ్ఛ, హక్కులను భంగం కలిగిస్తూ దాడులకు పాల్ప డితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.