ఎమ్మిగనూరును రెవిన్యూ డివిజన్ గా చేయాలి
ఎమ్మిగనూరును రెవిన్యూ డివిజన్ గా చేయాలి
ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం (పీడియస్యూ )
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తున్న తరుణంలో ఎమ్మిగనూరును ప్రభుత్వం చిన్న చూస్తూ రెవెన్యూ డివిజన్ చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది అని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం (పీడియస్యూ ) తాలూకా కార్యదర్శి,శివ విమర్శించారు. అనంతరం స్థానిక పీడియస్ యూ కార్యాలయము నందు సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన భాగంగా కర్నూల్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు గా ప్రకటించడం జరిగింది అందులో ఎమ్మిగనూరు ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోవడం ప్రభుత్వం ఎమ్మిగనూరు పట్ల అభివృద్ధి వివక్ష వివక్షత గురిచేస్తున్నాయి అన్నారు. ఎమ్మిగనూరు చేనేత రంగంలో దేశంలో మొదటి స్థానం ఉండేది కానీ ఇపుడు చేనేత రంగం కనుమరుగు అవుతుంది అని దీనిపై ఆధారపడిన చేనేతల పరిస్థితి దారుణంగా ఉంది అన్నారు గతంలో ఇక్కడ చేనేతల కొరకు క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు గాని ఆ హామీని విస్మరించారు ఇక్కడ పరిశ్రమలు నిర్మిస్తాం అన్నారు కానీ ఎక్కడ ఒక పరిశ్రమలు కూడా నెలకొల్ప లేదు ఇక్కడున్న ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఎమ్మిగనూరులో ప్రభుత్వ భూములు అనేకం ఉన్నపటికీ మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేయలేదు ప్రభుత్వ ఐటీఐ కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు వలసలు వెళుతూ బ్రతుకులు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రాంత అభిరుద్ది కోసం ఎమ్మిగనూరు ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి లేని యెడల అందోళన చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడియస్ యూ నాయకులు బాషా,రవి,నితిన్,తదితరులు పాల్గొన్నారు