
ఫ్యాక్షన్ వద్దు… అభివృద్ది ముద్దు
జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ ఐపియస్
కర్నూలు జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన రోజే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చేపట్టిన జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ ఐపియస్
కౌతాళం మండలం, ఫ్యాక్షన్ గ్రామమైన కామవరం లో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టిన జిల్లా ఎస్పీ
సమస్యలుంటే పోలీసులకు సమాచారం అందించాలి
కర్నూలు క్రైమ్, జూన్ 23, (సీమకిరణం న్యూస్) :
పల్లెనిద్రలో భాగంగా జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ ఐపియస్ గురువారం రాత్రి కౌతాళం మండలం, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కామవరం గ్రామాన్ని సందర్శించారు. కామవరం గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్టీసి బస్టాండ్, అంగన్ వాడి సెంటర్ ను , రైతు భరోసా కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో ముందుగా గ్రామ ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫ్యాక్షన్ జోలికి ఏవరు కూడా వెళ్ళవద్దన్నారు. పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే ఏవరిని ఉపేక్షించేది లేదన్నారు. తదుపరి రోజుల్లో అన్ని శాఖల అధికారులతో మాట్లాడి గ్రామాభివృద్ది కి చర్యలు తీసుకుంటామన్నారు.
మహిళలకు ఏల్లవేళల్లా అండగా ఉంటామన్నారు. దిశా యాప్ ను ప్రతి ఒక్క మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలన్నారు. ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పల్లె నిద్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేస్తామన్నారు. 200 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.