
హెల్త్ అవేర్నెస్ పై సైకిల్ యాత్ర – కాశ్మీర్ టు కన్యాకుమారి
ఆరోగ్యం పై ప్రతి ఒక్కరూ దృష్టి
సారించాలి
సైక్లిస్ట్ సయ్యద్ అబ్దుల్లా (హైదరాబాద్)
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర
వెల్దుర్తి, నవంబర్ 19, (సీమకిరణం న్యూస్) :
ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
సైకిల్ యాత్ర చేపట్టినట్లు హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అబ్దుల్లా తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైక్లిస్ట్ ఫుర్ ఖాన్ అహ్మద్ సైకిల్ యాత్ర చేపట్టాడు. కాశ్మీర్ నుండి హైదరాబాద్ కు సైకిల్ యాత్ర చేరడంతో అతనితో కలిసి హైదరాబాదు నుండి కన్యాకుమారి వరకు సయ్యద్ అబ్దుల్లా సైకిల్ యాత్ర చేపట్టారు. బుధవారం వీరి సైకిల్ యాత్ర వెల్దుర్తి హనుమాన్ జంక్షన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా సయ్యద్ అబ్దుల్లా మాట్లాడుతూ సైకిల్ యాత్ర చేస్తూ ఐక్యత, శాంతి, ఫిట్ నెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తునట్లు
తెలిపారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ సాధించాలన్నారు. అలాగే క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్గా ఉంటుందని, అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చన్నారు.
అందుకే హైదరాబాద్ నుండి కన్యాకుమారికి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫుర్ ఖాన్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేయడానికి ప్రధాన కారణం తన శారీరక మానసిక సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి అని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి సామర్థ్యాలను పరిశీలించుకోవాలన్నారు. వీరు ఇరువురు తమ లక్ష్యాన్ని అనుకున్న సమయంలో సాధించాలని సీమకిరణం న్యూస్ కోరుకుంటుంది.




