పార్టీ సభ్యత్వం చేయించిన వారికి ప్రాధాన్యత
- ఏఐసీసీ కార్యదర్శి, పీసీసీ వ్యవహారాల ఇన్చార్జి మెయప్పన్

పార్టీ సభ్యత్వం చేయించిన వారికి ప్రాధాన్యత
– ఏఐసీసీ కార్యదర్శి, పీసీసీ వ్యవహారాల ఇన్చార్జి మెయప్పన్
– పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్
నంద్యాల ప్రతినిధి, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం చేయించిన వారికి నియోజకవర్గ ఇంచార్జ్, పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి, పీసీసీ వ్యవహారాల ఇన్చార్జి మెయప్పన్, పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ లు పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు జంగిటీ లక్ష్మి నరసింహ యాదవ్ అధ్యక్షతన జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విలేఖరుల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ నేటి స్వార్ధ రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ విధ్వంసకర రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎలాంటి అడ్డదారులు తొక్కడానికయినా వెనుకాడదని ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు సిడీ మయప్పన్ మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రయివేటుకి అమ్మి వేస్తున్నారని ఇలానే ఉంటే మోడీ దేశాన్నే అమ్మివేస్తాడన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్ష్మీనరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు చింతలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, జిల్లా కార్యదర్శి జనార్ధన్, అల్లగడ్డ నియోజకవర్గం సమన్వయకర్త మల్లేశ్వర రెడ్డి, నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త ఫరూక్, జిల్లా పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ ఖాన్, స్టేట్ బీసీ సెల్ కన్వీనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.